ప్రతి పేదవాడికి ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా నేరడిగుంట గ్రామసభలో మంత్రి దామోదర రాజనర్సింహ హాజరై మాట్లాడారు. అర్హత ఉన్న వారికి ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సహాయం తప్పక అందుతుందన్నారు. రైతు రుణమాఫీ త్వరలో పూర్తవుతుందన్నారు.
జనవరి 26నుంచి రైతు భరోసా పంపిణీ జరుగనుందన్నారు. వితంతు, వృద్ధాప్య, వికలాంగుల పించన్ ఇంకా రావాల్సిన వారికి ప్రభుత్వం అందిస్తుందని, ఆందోళన అక్కరలేదన్నారు. ఇచ్చిన అన్ని హామీలు త్వరలో నెరవేరుస్తామన్నారు. రాబోయే 10 రోజుల్లో నేరేడుగుంట నుంచి ఇళ్ల నిర్మాణం చేపడతామని, ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆర్డీవో సర్వే చేయించి, సర్వే చేసిన భూమిని నిరు పేదలకు ఇళ్లకు కేటాయిస్తారని రాజనరసింహ వెల్లడించారు.