ఏపీలో విషాదం చోటు చేసుకుంది. ఏపీ కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టులో మరో అభ్యర్థి మృతి చెందాడు. కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టులో అపశ్రుతి జరిగింది.. పుట్టినరోజు నాడే అభ్యర్థి మృతి చెందాడు. విశాఖపట్నంలో కానిస్టేబుల్ అభ్యర్థుల ఫిజికల్ టెస్టులో 1600 మీటర్ల రన్నింగ్ సమయంలో కుప్పకూలాడు అభ్యర్థి శ్రావణ్ కుమార్.
అయితే.. వెంటనే అభ్యర్థి శ్రావణ్ కుమార్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పోలీసు అవుతాడనుకున్న కొడుకు పుట్టినరోజునే మృతి చెందటంతో కన్నీరుమున్నీరయ్యారు కుటుంబ సభ్యులు. అయితే.. అభ్యర్థి శ్రావణ్ కుమార్ మృతి ఇప్పుడు ఇతర అభ్యర్థులలో కొత్త టెన్షన్ తీసుకొచ్చింది.