ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 5వ తేదీని ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుండగా.. అదే నెల 8వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.ఈ ఎన్నికల్లో ఢిల్లీలోని జంగ్పురా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మనీష్ సిసోడియా బీజేపీ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తాను తీహార్ జైలులో ఉన్న సమయంలో బీజేపీలో చేరితే, ఆప్ ఎమ్మెల్యేలను డైవర్ట్ చేసి తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కేంద్రంలోని కమలం పార్టీ ఆఫర్ చేసిందని సిసోడియా ఆరోపించారు.ఆ ఆఫర్ను తిరస్కరిస్తే జీవితకాలం జైల్లోనే ఉండాల్సి వస్తుందని తనను హెచ్చరించారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలను విచ్ఛిన్నం చేయడమే బీజేపీ ప్రధాన ఎజెండా అని ఆయన విమర్శలు గుప్పించారు. ఆప్తో రాజకీయ పోటీని బీజేపీ వ్యక్తిగత పోటీగా మార్చిందని ఆరోపించారు.