అమర వీరుల స్థూపంపై గోనె ప్రకాశ్‌ సంచలన వ్యాఖ్యలు !

-

అమర వీరుల స్థూపంపై గోనె ప్రకాశ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నీ కలిసిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు…ఈ సందర్భంగా గన్ పార్క్ లోని అమర వీరుల స్థూపం పై నామకరణం చేయాలని కోరారు. అనంతరం గోనె ప్రకాశ రావు మాట్లాడుతూ… గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపంపై నామకరణం చేయాలని కోరారు. 1970 లో ఆనాటి మేయర్ లక్ష్మీ నారాయణ ముదిరాజ్ శంకుస్థాపన చేశారని… 144 సెక్షన్ మధ్య లాఠీ చర్చ్ జరిగిన శంకుస్థాపన ఆగలేదని తెలిపారు.

Gone Prakash Rao comments on brs mlas

సంవత్సరాలు గడిచిన ఇప్పటి వరకు నామకరణం జరగలేదని… ప్రపంచ చరిత్రలో ఏ స్థూపం ఉన్న పేరు అనేది ఉంటుందని పేర్కొన్నారు. నామకరణం కోసం పీసీసీ అధ్యక్షుడికి వినతి పత్రం ఇచ్చానని… స్మృతి వీరుల చిహ్నానికి నామకరణం పెట్టకుండా బిఅరెస్ నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహించారు. పర్యాటకులు పేరు లేని స్థూపం చూసి ఏమని అనుకోవాలి… తెలంగాణ స్మృతి వీరుల చిహనాన్ని దాని చరిత్ర ప్రపంచ తెలుగు వారికి తెలియాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news