మహిళలతో అలాంటి పనులు…కడప రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ పై వేటు

-

కడప రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డికి బిగ్‌ షాక్‌ తగిలింది. కడప రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డిపై తాజాగా బదిలీ వేటు పడింది. బాపట్ల, శ్రీకాకుళంలో పనిచేసిన సమయంలోనూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చంద్రశేఖర్‌‌పై ఆరోపణలు వచ్చాయి. మహిళా బ్రేక్ ఇన్‌స్పెక్టర్ ఇంటికి వెళ్లి వేధించారట కడప రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి.

Kadapa Transport Deputy Commissioner Chandrasekhar Reddy has been transferred recently

నిన్న డీటీసీపై మహిళా ఉద్యోగి కుటుంబ సభ్యులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో డీటీసీపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఆగ్రహం, బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని చంద్రశేఖర్‌కు ఆదేశాలు ఇచ్చారు. కడప డీటీసీపై ఇప్పటికే 4 కేసులు నమోదైనట్లు సమాచారం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news