సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసిపడటంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఈ భారీ అగ్నిప్రమాదం ఏపీలోని శ్రీకాకుళం లో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం సూర్యామహళ్ జంక్షన్‌లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. రంగంలోకి దిగింది. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు ఫైర్ అధికారులు. ఇక అప్పటికే కొన్ని లక్షల నష్టం వాటిల్లినట్లు సమాచారం అందుతోంది. ఇక సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం…
మంటలు ఎగిసిపడటంతో దట్టంగా అలుముకున్న పొగ
రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్న సిబ్బంది
శ్రీకాకుళం సూర్యామహళ్ జంక్షన్‌లోని షాపింగ్ మాల్ లో ఘటన#SouthIndiaShoppingMall #FireAccident #Srikakulam #Andhrapradesh pic.twitter.com/zXEVwIuhNW
— Pulse News (@PulseNewsTelugu) January 25, 2025