వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు

-

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనను విమర్శిస్తూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వమంటే.. సీఎం చంద్రబాబు మర్డర్లకు ఆర్డర్లు ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వ పాలనపై వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎదురు తిరగాలని అన్నారు గోరంట్ల మాధవ్. అంతేకాదు అవసరమైతే అవతలి వాళ్ళను చంపాలని రెచ్చగొట్టారు.

” రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే.. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పరిపాలన మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉంటే.. ఈరోజు చంద్రబాబు నాయుడు హయాంలో మూడు రే**, ఆరు మర్డర్డు అన్నట్టుగా పరిపాలన కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు.. నువ్వు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వమంటే.. మర్డర్లకు ఆర్డర్లు ఇస్తున్నావు. తస్మాత్ జాగ్రత్త. ఈరోజు కురువ వీరన్న అనే ఒక అమాయకుడు, ఆరుగురు మంది చిన్నారులు కలిగిన వీరన్నను దారుణంగా చంపి, ఆ తల్లి కడుపు కోతకు, పిల్లల ఏడుపుకు మీరు నాశనం అయిపోతారు.

దయచేసి ఇలాంటి హత్యలను ప్రోత్సహించకుండా చంద్రబాబు నాయుడు ఈ హత్యలకు పులిస్టాప్ పెట్టాలి. వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కూడా సర్దుకుంటూ పోతే, వారు చంపుకుంటూనే పోతున్నారు. అవసరమైతే మనం మన ఆత్మ రక్షణ కోసం చేతికి దొరికిన దాంతో మన ఆత్మ రక్షణ కోసం అవతలి వారిని చంపడానికి కూడా సిద్ధపడాల్సిన అవసరం ఉంది” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు గోరంట్ల మాధవ్.

Read more RELATED
Recommended to you

Latest news