ఇందిరమ్మ ఇళ్లపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇళ్ల పథకానికి ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని అన్నారు బండి సంజయ్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే నిధులు ఇస్తామని అన్నారు. అలాగే కాంగ్రెస్ ఫోటోలు పెడితే రేషన్ కార్డులు కూడా ఇవ్వమని, అవసరమైతే తాము ముద్రించి ప్రజలకు రేషన్ కార్డులు జారీ చేస్తామని అన్నారు.
ఈ క్రమంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. శనివారం గాంధీభవన్ లో మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము ప్రధానమంత్రిని గౌరవిస్తామని, దేశం కోసం ఇందిరమ్మ త్యాగం ముందు మీరు, నీ మోడీ ఎంత అని అన్నారు.
బండి సంజయ్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చేతల ప్రభుత్వం అనడానికి దావోస్ పెట్టుబడులే నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు తరువాత రికార్డు స్థాయిలో రూ 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు మహేష్ కుమార్ గౌడ్.