వనపర్తి జిల్లాలోని ఎస్సీ బాలుర హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థి ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు.మృతుడు గోపాల్‌పేట మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌లో చదివే ఉడుముల భరత్ (8వ తరగతి)గా గుర్తించారు. ప్రతిరోజూ లాగానే ఉదయం 5.30 గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకుని.. ఏడు గంటలకు హాస్టల్ కాంపౌండ్ వాల్‌లో స్టడీ అవర్స్ కూర్చున్న భరత్.. ఉన్నట్టుండి ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
ఒక్కసారిగా కిందపడిపోవడంతో తోటి విద్యార్థులు ఫిట్స్ అనుకుని తాళాల గుత్తిని చేతిలో పెట్టారు.అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. మరల అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నర్సింగయ్య పల్లి చిన్న పిల్లల దవాఖానాకు తీసుకెళ్లగా శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నట్లు డాక్టర్ గుర్తించారు.చివరకు పల్స్ రేటు పడిపోయి విద్యార్థి చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. దీంతో విద్యార్థి డెడ్ బాడీని నర్సింగయి పల్లి ప్రభుత్వ దవాఖాన,డిగ్రీ కాలేజ్ ఎదుట ఉంచి విద్యార్థి సంఘాలు,బంధువులు ధర్నాకు దిగారు.