నామినేటేడ్ పదవులపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినా ఆరు నెలల్లో రెండు విడుతలుగా నామినేటేడ్ పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే మరోసారి సీఎం చంద్రబాబు నామినేటేడ్ పదువులపై స్పందించారు. సీఎం చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసారు. జూన్ లోపు నామినేటేడ్ పోస్టుల భర్తీ చేస్తామని చెప్పారు.

త్వరలో 214 మార్కెట్ కమిటీలు, 1,100 ట్రస్ట్ బోర్డులను నియామాకాలు ఉంటాయని తెలిపారు. క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ సభ్యులనే సిఫారసు చేయాలనీ సీఎం చంద్రబాబు సూచించారు. ఈ తరుణంలోనే మంత్రులు జిల్లాలో ఎమ్మెల్యేలతో కూర్చొని పార్టీ అంశాలపై చర్చించి.. సమస్యలు పరిష్కరించాలి. అదేవిధంగా పెండింగ్ బిల్లులు చెల్లించేలా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పని చేయాలి. ఇతర పార్టీల నుంచి నిన్న మొన్న వచ్చి చేరిన వారి కంటే.. ఎప్పటి నుంచో పార్టీలో నుంచి పార్టీని నమ్ముకున్న వారికే పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news