ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ప్రధాన పార్టీల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఈ మేరకు ఢిల్లీలోని ఘోండా నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించిన ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 05న ఆప్ సర్కార్ జాయేగీ.. బీజేపీ సర్కార్ ఆయేగీ.. అని ఢిల్లీలోని ప్రజలంతా అంటున్నారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
వాటర్ ట్యాంకర్ మాఫియాను అడ్డుకొని ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే ప్రభుత్వాన్ని ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అబద్దపు వాగ్దానాలు, మోసాలను ఢిల్లీ ప్రజలు కోరుకోవడం లేదు. ఇలాంటివి చేయడానికి ఆప్ సర్కార్ కు ఇక చోటు చోటులేదు. ప్రజల కోసం ఇళ్లు నిర్మించే ప్రభుత్వం ఢిల్లీకి కావాలి. మహిళలు విద్యార్థులు, వృద్దులు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారుల కోసం మా మేనిఫెస్టో పథకాలు రూపొందించామన్నారు.