రోడ్ సేఫ్టీ అవేర్నెస్ పార్క్ లు త్వరలోనే ప్రారంభం – మంత్రి పొన్నం

-

రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాసోత్సవాల్లో భాగంగా HMDA గ్రౌండ్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ లో వాక్ థాన్ కార్యక్రమం ప్రారంభించారు తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్రంలో రోడ్ ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరికి రోడ్ భద్రత పై అవగాహన పెంచేందుకు నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది రవాణా శాఖ..విద్యాసంస్థల్లో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ పార్క్ లను కూడా ప్రారంభించింది రవాణా శాఖ.

ponnam

ఇక ఈ సందర్భంగా తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి లైసెన్స్ రద్దు చేస్తామని… ఇకముందు నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. ఇది అందరి సామాజిక బాధ్యత.. అందరం పాటిద్దామని తెలిపారు. అవగాహన కోసం హైదరాబాద్ నలుమూలల నుంచి విద్యార్ధులు కదిలి రావడం చాలా సంతోషం అని వివరించారు. రాబోయే కాలంలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ పార్క్ లు పెద్దసంఖ్యలో ప్రారంభిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news