ఆ కాలేజీని దత్తత తీసుకోండి.. దేశ్ పాండే ఫౌండేషన్ కు సీఎం సూచన

-

రాష్ట్రంలోని కస్తూర్భా బాలికల పాఠశాలలో పని చేయాలని, మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను దత్తత తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి దేశ్ పాండే ఫౌండేషన్ కు సూచించారు. శుక్రవారం హైదరాబాద్ లో దేశ్ పాండే ఫౌండేసన్ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక పరిస్తితుల మార్పు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఆంగ్లంలో శిక్షణ, విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడానికి పని చేస్తున్న తమ సంస్థ కార్యక్రమాల విస్తరణకు ప్రభుత్వ సహకారం కోరారు.

ఫౌండేషన్ సభ్యుల విజ్ఞప్తిని విన్న సీఎం రేవంత్ రెడ్డి వారికి పై సూచనలు చేశారు. సీఎం సూచనలోనూ ఫౌండేషన్ సభ్యులు అంగీకరించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, సభ్యులు గురురాజ్ దేశ్ పాండే, జయశ్రీ, రాజురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news