పెద్దవాళ్ళు బయటకు వెళ్లొచ్చాక కాళ్ళు కడుక్కోమని ఎందుకు చెప్తారు.. సైంటిఫిక్ రీజన్ తెలుసా..?

-

బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన తరువాత ముందుగా కాళ్లు కడుక్కొని ఇంట్లోకి రమ్మని పెద్దవారు చెబుతూ ఉంటారు. అయితే దానికి సరైన కారణం తెలియకపోయినా చాలా శాతం మంది దీనిని పాటిస్తూ వస్తారు. అయితే దీనికి సంబంధించి కొన్ని రకాల కారణాలు కూడా ఉన్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం బయట నుండి ఇంటికి తిరిగి వచ్చాక కాళ్ళు కడుక్కుని లోపలికి రావడం వలన ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రాదు మరియు తిరిగిన చెప్పులతో లేక బూట్లతో ఇంట్లోకి రావడం వలన తెలియకుండానే ఎంతో కీడు జరుగుతుంది అని పెద్దలు నమ్ముతారు. అందుకే వాళ్ళు ప్రతిరోజు బయట నుండి తిరిగి వచ్చిన తరువాత ప్రతిసారి కాళ్ళను శుభ్రం చేయమని చెబుతూ ఉంటారు.

 

కేవలం వాస్తు పరంగా మాత్రమే కాకుండా సైన్స్ కూడా కాళ్ళను శుభ్రం చేసుకుని మాత్రమే ఇంట్లోకి రావాలని చెబుతోంది. ఎందుకంటే ఆయుర్వేదం కూడా ఒక వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించే ముందు మరియు రాత్రి పడుకునే ముందు ఎప్పుడూ పాదాలను శుభ్రం చేసుకొని పడుకోవాలి అని నిపుణులు చెబుతున్నారు. దానికి సంబంధించి ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఎప్పుడైతే బయట నుండి వచ్చి పాదాలను కడుగుతారో పాదాలు ఎంతో శుభ్రంగా ఉండడమే కాకుండా మానసికంగా కూడా ఎంతో మంచి ప్రశాంతతను పొందవచ్చు.

అంతేకాక ఒత్తిడి వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడైతే బయట నుండి తిరిగి ఇంట్లోకి వస్తారో అప్పుడు పాదాలకు ఉండేటువంటి దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా ఇంట్లోకి వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే తప్పకుండా లోపలికి వచ్చే ముందు కాళ్ళను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి మరియు పాదాల నొప్పి కూడా తగ్గుతుంది. కొంతమంది సాక్స్ ధరించడం వలన కాళ్లను శుభ్రం చేసుకోవడం అవసరం లేదని భావిస్తారు. అయితే పాదాలకు సాక్స్ ఉన్నాసరే శుభ్రం చేసుకోవడం ఎంతో అవసరం.

Read more RELATED
Recommended to you

Latest news