వచ్చే 30 సంత్సరాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది : మంత్రి కోమటిరెడ్డి

-

దేశంలో మొట్ట మొదటి సారి కుల గణన చేసి.. దేశానికి ఆదర్శనంగా నిలిచాం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన.. 100% కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. వచ్చే 30 సంత్సరాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేసారు. అలాగే ఈ సమావేశంలో పార్టీ బలోపేతం గురించి చర్చించాం. ప్రతి ఒక్క కార్యకర్తకు అందుబాటులో ఉండాలని సూచించాం.

మొదటి సారి ఎమ్మెల్యే కావడం సులభం.. కానీ దాన్ని నిలబెట్టుకోవాలి. ఎమ్మెల్యే లు కలిసి భోజనం చేస్తే తప్పేనా.. అది కూడా రాజకీయం చేస్తార. ప్రతి పక్షాలకు పని లేదు.. పడేండ్లు అధికారంలో ఉండి ఏం చేయలేదు… ఇపుడు ఎం చేయరు.. సోషల్ మీడియా ప్రచారం తప్ప. దమాషా ప్రకారం సీట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఇక కుటుంబ సర్వే లో పాల్గొనని వాళ్ళు మాట్లాడితే ఎలా. అయినా ఆ సమయంలో కవిత, కేటీఆర్ కేసుల గురించి.. అడ్వకెట్ తో మాట్లాడినికి వెళ్తే వెళ్లుండొచ్చు అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news