బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం.. పార్లమెంట్‌కు నిర్మలా సీతారామన్

-

కేంద్ర బడ్జెట్‌ను నేడు పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నారు. దీనిమీద సామాన్యులు చాలా ఆశలు పెట్టుకున్నారు. నేడు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

మరికాసేపట్లో ఈ ప్రక్రియ సాగనుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర కేబినెట్ సమావేశం కాగా 2025-26 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. అంతకు ముందు నిర్మలా సీతారామన్ ఆర్ధిక మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి బయలుదేరి నేరుగా రాష్ట్రపతి భవన్ వెళ్లి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత బడ్జెట్‌కు సంబంధించిన కీలక పత్రాలకు రాష్ట్రపతికి అందజేశారు.ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటుకు బయలు దేరారు.ఆమె వెంట బడ్జెట్ తయారీలో కీలక పాత్ర పోషించిన ఫైనాన్స్ అధికారులు ఉన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news