కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి సొంత పార్టీ నేతలు షాకిచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ – మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్ఫో ర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్ రెడ్డిని ప్రకటించిన రోజే జగిత్యాల జిల్లా కేంద్రంలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, కాంగ్రెస్ కేడర్.. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు కరచాలనం చేసి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.
జగిత్యాల జిల్లా ధర్మపురిలో మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాలలో ఫుడ్ పాయిజన్‌కు గురై ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురైన విద్యార్థులను ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ పరామర్శించడానికి రాగా.. జగిత్యాలలో ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను ఆ హాస్పిటల్ వద్దకు జిల్లా కాంగ్రెస్ కేడర్ అతనిని పిలిపించుకుని ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.
అస్వస్థకు గురైన విద్యార్థులను ఆస్పత్రిలో పరామర్శించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ప్రసన్న హరికృష్ణతో కాసేపు మాట్లాడి బయటికి రాగా..జిల్లా కాంగ్రెస్ కేడర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు, టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు, జగిత్యాల మైనార్టీ టౌన్ అధ్యక్షులు, ధర్మపురి అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తదితరులంతా ప్రభుత్వ విప్‌ను వదిలి ప్రసన్న హరికృష్ణ వెంట బయటకు వచ్చి తమకు తాను పరిచయం చేసుకొని మద్దతు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఝలక్ ఇచ్చిన ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే, జగిత్యాల క్యాడర్
ఉమ్మడి నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ – మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్ఫో ర్స్ విద్యాసంస్థల అధినేత వీ. నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా… https://t.co/wzMLubN1KB pic.twitter.com/iUi6IOmCwJ
— Telugu Scribe (@TeluguScribe) February 1, 2025