బిగ్ బ్రేకింగ్..సీఎం రేవంత్‌పై తిరుగుబావుటా ఎగరేసిన 10 మంది సొంత పార్టీ ఎమ్మెల్యేలు

-

కాంగ్రెస్ పార్టీలో ఊహించిన అలజడి రేగింది. ఆ పార్టీలో ఒక్కసారిగా భారీ కుదుపుగా ఈ అంశాన్ని చెప్పుకోవచ్చు. అధిష్టానానికి తెలియకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది రహస్యంగా ఒక చోట సమావేశం అయ్యారు.

వీరంతా సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు జెండా ఎగరేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫాంహౌజ్‌లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీక్రెట్‌గా మీటింగ్ పెట్టుకున్నట్లు సమాచారం.పనులు కాకపోవడంపై ఎమ్మెల్యేల తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. సీఎం, రెవెన్యూ మంత్రులే టార్గెట్‌గా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పెట్టిన మీటింగుకు 10 మంది ఎమ్మెల్యేలు వెళ్లగా ఆ మీటింగ్ సారాంశం గురించి నిఘా వర్గాలు ఆరా తీసినట్లు తెలుస్తోంది. మంత్రుల మీద అసహనం వల్లే ఈ భేటీ జరిగినట్లు టాక్ వినిపిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news