రాష్ట్రంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్ మంత్రులతో అత్యవసరంగా సమావేశం అయ్యారు. దీనికి కేబినెట్ మంత్రులు మాత్రమే హాజరయ్యారు. ఈ భేటీకి అధికారులు రావొద్దని సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఈ అత్యవసర భేటీపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఈ భేటీలో ఏయే విషయాలపై చర్చ జరుగుతుందోనని అంతా ఆలోచలనలో పడ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో మంత్రుల పనితీరుపై సీఎం క్లాస్ పీకుతారా? అని కొందరు అనుకుంటుంటే.. కొందరు మంత్రుల పనితీరు వలన పార్టీకి చెడ్డ పేరు వస్తుందని టాక్ వినిపిస్తోంది.దీనిపై నేడు సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. దీనికి తోడు మంత్రుల తీరు నచ్చక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్ది ఇంట్లో 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయిన విషయంపైనా సీరియస్గా చర్చ జరగనున్నట్లు టాక్ వినిపిస్తోంది.