గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరోసారి వీధికుక్కలు రెచ్చిపోయాయి. నాలుగేళ్ల చిన్నారిపై రెండు వీధి కుక్కులు ఒక్కసారిగా మీద పడి దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారి కాలు, నడుము, తొడ భాగాల్లో తీవ్ర గాయాలు గాయాలయ్యాయి. చిన్నారి అరుపులు విని తల్లి ఒక్కసారిగా బయటకు పరిగెత్తుకు రావడంతో కుక్కలు అక్కడి నుంచి పరిగెత్తాయి.
ఈ దారుణ ఘటన హైదరాబాద్ – రాజేంద్రనగర్ లోని గోల్డెన్ హైట్స్ కాలనీలో శనివారం ఉదయం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.దీంతో చిన్నారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, వీధికుక్కలపై చర్యలు తీసుకోవాలని ఎన్ని మార్లు మొరపెట్టుకున్నా అధికారులు స్పందించడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి
హైదరాబాద్ – రాజేంద్రనగర్ లోని గోల్డెన్ హైట్స్ కాలనీలో ఓ నాలుగేళ్ల చిన్నారిపై రెండు కుక్కలు దాడి
చిన్నారి తల్లి వెంటనే పరిగెత్తుకు రావడంతో చిన్నారిని విడిచిపెట్టిన కుక్కలు
చిన్నారి కాలు, నడుము, తొడ భాగాల్లో తీవ్ర గాయాలు pic.twitter.com/h3COK1a4oS
— Telugu Scribe (@TeluguScribe) February 1, 2025