Income Tax: కొత్త పన్ను శ్లాబులు ఇవే…వారికి రూ.80 వేలు ఆదా !

-

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వ‌రుస‌గా 8 సారి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టి చ‌రిత్ర సృష్టించారు. ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభ‌మైన బ‌డ్జెట్ ప్ర‌సంగం.. మ‌ధ్యాహ్నం 12.15 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగింది. మెుత్తం గంటా 15 నిమిషాలు కొనసాగింది. బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని గుర‌జాడ అప్పారావు సూక్తితో నిర్మ‌లా ప్రారంభించారు. చివ‌ర‌గా ప‌న్నుల‌కు సంబంధించిన అంశాన్ని చెప్పి.. త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని ముగించారు.

IncomeTax

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్రకటించిన కొత్త పన్ను శ్లాబుల సవరణ ప్రకారం.. రూ.0-4 లక్షల వరకు నో టాక్స్‌ ఉంటుంది. రూ.4 – 8 లక్షల వరకు 5 శాతం టాక్స్‌ కట్టాల్సి ఉంటుంది. రూ.8 – 12 లక్షల వరకు 10 శాతం టాక్స్‌ కట్టాల్సి ఉంటుంది., రూ. 12 – 16 లక్షల వరకు 15 శాతం టాక్స్‌ కట్టాల్సి ఉంటుంది., రూ. 16 – 20 లక్షల వరకు 20 శాతం టాక్స్‌ కట్టాల్సి ఉంటుంది., రూ. 20 – 24 లక్షల వరకు 25 శాతం టాక్స్‌ కట్టాల్సి ఉంటుంది., రూ.24 లక్షలు దాటితే 30 శాతం టాక్స్‌ కట్టాల్సి ఉంటుంది.

  • రూ. 0 – 4 లక్షల రూపాయలు – సున్నా

    రూ. 4 – 8 లక్షల రూపాయలు – 5 శాతం

    రూ. 8 – 12 లక్షల రూపాయలు – 10 శాతం

    రూ. 12 – 16 లక్షల రూపాయలు – 15 శాతం

    రూ. 16 – 20 లక్షల రూపాయలు – 20 శాతం

    రూ. 20 – 24 లక్షల రూపాయలు – 25 శాతం

    24 లక్షల రూపాయల పైన – 30 శాతం

 

 

Read more RELATED
Recommended to you

Latest news