AIకి పెద్ద పీట.. భారీగా కేటాయింపులు..ఇండియా నెంబర్‌ 1 కావడమే ! !

-

AI అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ తో దేశంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నారు. దీనిలో భాగంగా కృత్రిమ మేధ అభివృద్ధికి రూ.500 కోట్లతో మూడు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. విద్య ప్రమాణాలను మెరుగుపర్చడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో మూడు ఎక్సలెన్స్ కేంద్రాలను స్థాపించనున్నట్లు మంత్రి ప్రకటించారు.

Union Budget 2025 nirmala sitharaman on ai

అటు అంతేకాకుండా వెనుకబడిన వర్గాలైన షెడ్యూల్ తరగతులకు చెందిన మహిళలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఎస్సీ,ఎస్టీ,కులాల తెగల మహిళల కోసం టర్మ్ లోన్ పథకాన్ని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ పథకం ద్వారా కొత్తగా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు, ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి ఈ స్కీమ్ ఉపయోగకపడుతుంది. దీని కింద ఐదేళ్లలో రూ.2 కోట్ల వరకు రుణాలను అందించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా మొత్తం 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రయోజనం చేకూరనుందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news