హైదరాబాద్ లో హైటెక్ టవర్స్ కోసం చాలా కష్టపడ్డాను – సీఎం చంద్రబాబు

-

నేడు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం మోటుకట్లలో ఓ వృద్ధురాలు ఇంటికి వెళ్లి పింఛన్ అందజేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. అనంతరం అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 30 ఏళ్ల క్రితమే తాను ఐటీని ప్రమోట్ చేసినప్పుడు ఎవరికి ఐటి అంటే తెలియదన్నారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్యూచర్ తాను ఆ రోజులలో ఊహించి దానిపై శ్రద్ధ పెడితే మొదట్లో ఎవరికి అర్థం కాలేదని పేర్కొన్నారు. హైదరాబాద్ లో హైటెక్ టవర్స్ నిర్మాణం కోసం చాలా కష్టపడ్డానన్నారు. అనంతరం హైటెక్ టవర్స్ ని చూసిన విద్యార్థులకు తాము కూడా ఐటీ ఉద్యోగం చేయాలనే కోరిక పుట్టిందని చెప్పుకొచ్చారు. 30 ఇంజనీరింగ్ కాలేజీలను 9 ఏళ్లలో 300 ఇంజనీరింగ్ కాలేజీలుగా చేశామన్నారు.

ఇక ఉద్యోగరీత్యా ఓవైపు ఇంటి నుంచి పని చేస్తూనే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు.. మంత్రి పదవి చేపట్టొచ్చని సరదాగా వ్యాఖ్యానించారు. ఇక తనని 53 రోజులపాటు జైల్లో పెడితే తనకోసం ఐటీ ఉద్యోగులు 80 దేశాలలో నిరసనలు చేశారని తెలిపారు చంద్రబాబు. ప్రతి దేశంలో బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వెళ్తే అక్కడ మన తెలుగు వారు ఉంటారని పేర్కొన్నారు. సంబేపల్లి మీదుగా కాలువ నిర్మాణం చేపట్టి చిత్తూరుకు తీసుకువెళ్తామని, హంద్రీనీవా కాలువ నిర్మాణం త్వరగా పూర్తి చేస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news