మే నుంచి రైతు భరోసా: సీఎం చంద్రబాబు కలక ప్రకటన

-

తమది పేదల ప్రభుత్వమని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. మే నెల నుంచి రైతులకు రైతు భరోసా అందిస్తామని తెలిపారు. శనివారం రోజు అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దేశంలోనే అత్యధికంగా 4 వేల పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఏడాది రూ. 48 వేలు లబ్ధి చేకూరుస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం వాట్సప్ గవర్నెన్స్ తీసుకువచ్చామని వివరించారు.

ప్రతి ఇంట్లో ఐటీ ఉద్యోగి ఉండేలా చేయడమే తమ కోరిక అని తెలిపారు చంద్రబాబు. అమరావతి పేరు వింటే దేవతల రాజధాని అనేలా అభివృద్ధి చేస్తామన్నారు. కులం, మతం, ప్రాంతం లేదు.. అంటూ అమరావతిని స్మశానం, ఎడారి అని మూడుముక్కల ఆట ఆడి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. అమరావతిని అభివృద్ధి చేసి అక్కడి నుంచి వచ్చే నిధులను అక్కడే ఖర్చు పెడతామని తెలిపారు చంద్రబాబు. వికలాంగులకు 3000 నుంచి 6000 పెన్షన్ పెంచానని పేర్కొన్నారు.

ఇక కేంద్ర బడ్జెట్ పై స్పందిస్తూ.. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప పరిణామం అని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో వృద్ధికి ఆరు కీలక రంగాలను బడ్జెట్ గుర్తించిందని.. జాతీయ శ్రేయస్సు దిశగా ఈ బడ్జెట్ కీలక అడుగులు సూచిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కి చంద్రబాబు అభినందనలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news