హైదరాబాద్ మహానగరంలోని మూసి పరివాహక ప్రాంతాల్లో నివసించే…. పేద ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరట కలిగించింది. అక్కడ నివసించే ప్రాంత ప్రజలకు 25వేల రూపాయలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మూసి నది పరివాహక ప్రాంతం నుంచి వారిని తరలించేందుకు రవాణా ఖర్చుల నిమిత్తం.. తాజాగా 37.50 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగింది.
ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానికిషోర్ అధికారిక ఉత్తరుడు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 15,000 మంది కుటుంబాలకు 25వేల రూపాయలు చొప్పున… ఆర్థిక సహాయం చేయనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ డబ్బులు ఎవరికీ అందాలి అనే విషయంపై… కలెక్టర్లు అధ్యయనం చేయబోతున్నారు. అసలు లబ్ధిదారులను గుర్తించి డబ్బులను పంపిణీ చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు తెలంగాణ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఆదేశాలు ఇచ్చారు.