ఈ మధ్యకాలంలో సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వలన మరియు జీవన విధానంలో మార్పులు జరగడం వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కిడ్నీకు సంబంధించిన సమస్యలతో వయస్సుతో తేడా లేకుండా చాలా శాతం మంది బాధపడుతున్నారు. అయితే వీటిని తగ్గించడానికి కొన్ని రకాల అలవాట్లను తప్పక పాటించాలి. ప్రతిరోజు వీటిని పాటించడం వలన కిడ్నీల ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. మీ రోజు వారి ఆహారంలో భాగంగా ఆపిల్స్, బెర్రీస్ మరియు బొప్పాయి పండ్లను తీసుకోవాలి.
వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా అయినా తీసుకోవచ్చు. ఇలా చేయడం వలన కిడ్నీల ఆరోగ్యం మెరుగవుతుంది. డిహైడ్రేషన్ సమస్యతో బాధపడితే కిడ్నీకు సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతాయి. కనుక ప్రతిరోజు మంచినీరుని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మంచినీరుతో డిహైడ్రేషన్ మరియు కిడ్నీ సమస్యలను కూడా చెక్ పెట్టవచ్చు. ఎప్పుడైతే బ్లడ్ సర్కులేషన్ మెరుగుపడుతుందో కిడ్నీల పనితీరు కూడా బాగుంటుంది. కనుక ఉదయాన్నే కొంత సమయాన్ని వ్యాయామానికి లేక నడవడం వంటి వాటికి కేటాయించండి. ఈ విధంగా కిడ్నీల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
చాలా శాతం మంది ఉదయాన్నే టీ, కాఫీ వంటివి తాగుతారు. వాటికి బదులుగా గ్రీన్ టీ వంటి హెర్బల్ టీలను తాగడం వలన ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. దీంతో కిడ్నీల పనితీరు బాగుంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్, అధిక చెక్కర ఉండేటువంటి ఆహార పదార్థాలను బ్రేక్ ఫాస్ట్ లో అస్సలు తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వలన కిడ్నీల ఆరోగ్యం ఎంతో దెబ్బతింటుంది. అంతేకాకుండా బ్రేక్ ఫాస్ట్ లో తీసుకునే ఆహారం ఎంతో ఆరోగ్యాంగా, లైట్ గా ఉండాలి మరియు వాటిలో అధిక శాతం సోడియం ఉండకూడదు. ఈ విధమైన మార్పులను చేసుకుంటూ తరచుగా బ్లడ్ ప్రెజర్ ను చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన కిడ్నీకు సంబంధించిన సమస్యలను ముందుగానే తెలుసుకోవచ్చు.