మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి జరిపాడు. కిర్లంపూడిలోని ఆయన ఇంటిపై ఆదివారం తెల్లవారుజామున గంగాధర అనే యువకుడు ముద్రగడ ఇంటి వద్ద బీభత్సం సృష్టించినట్లు సమాచారం.
ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లి ఆయన ఇంటి గేటును ఢీకొట్టడంతో పాటు జై జనసేన అనే నినాదాలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.ఇంటి బయట శబ్దం రావడంతో కుటుంబ సభ్యులు బయటికి వచ్చి చూశారు. అప్పటికే ఆ యువకుడు ఇంటి బయట హల్చల్ చేయడం కనిపించింది.ట్రాక్టర్ తో ఇంటి బయట ఉన్న కారును కూడా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. అక్కడే ఉన్న ఫ్లెక్సీలను కూడా చించివేసినట్లు తెలుస్తోంది. దీంతో అతన్ని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.