నిధుల కేటాయింపులో తెలంగాణను తీవ్ర నిర్లక్ష్యం చేశారు అని మంత్రి సీతక్క అన్నారు. కేంద్ర మంత్రులు, ప్రధాని వద్దకు ఎన్ని సార్లు వెళ్ళినా చివరకు మొండి చేయి చూపారు. తెలంగాణ నుంచి కేంద్రం కి వెళ్తున్న పన్నులను దృష్టిలో పెట్టుకొని నిధులు కేటాయించాలి. నిన్నటి బడ్జెట్.. ఎన్నికల బడ్జెట్.. తప్ప కేంద్ర బడ్జెట్ కాదు. బీజేపీ బడ్జెట్ స్వార్ధ బడ్జెట్. తెలంగాణ అంటే బీజేపీ కి పిచ్చి విధ్వేషం. ప్రజలు ఆలోచించాలి.
కాంగ్రెస్ ఉన్న నిధులతో అభివృద్ధి సంక్షేమం చేస్తుంది. బీజేపీ వాళ్ళు కేవలం అయోధ్య నుంచి అక్షింతలు పంచడం తప్ప అభివృద్ధి కి నిధులు ఇవ్వడం లేదు. విభజన చట్టం లోని హామీలు మూడు సార్లు అధికారం లోని వచ్చిన అమలు చేయలేదు. మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం. అక్షింతలకు ఓట్లు వేద్దామా.. అభివృద్ధికి ఓటు వేద్దామ ప్రజలు ఆలోచించాలి. తెలంగాణకు ఇప్పటికైనా నిధులు కేటాయించాలి అని మంత్రి సీతక్క డిమాండ్ చేసారు.