తిరుమలలో అద్భుతం చోటు చేసుకుంది. తాజాగా తిరుమలలో పురాతన విగ్రహం బయటపడింది. తిరుమల శ్రీవారు స్నానం చేసిన నామాల కాలువ దగ్గర ఉన్న ఓ రైతు పొలంలో పురాతన విగ్రహం బయటపడింది. ఈ విగ్రహంపై స్వామివారి పాదాలు స్పష్టంగా కనబడుతున్నాయి.
పద్మావతి అమ్మవారిని కళ్యాణమాడి మార్గమధ్యలో రామచంద్రాపురం మండలం నడవలూరు నెన్నూరు పంచాయతీల మధ్య ఉన్న ఈ కాలువ దగ్గర శ్రీవారు స్నానం చేసి నామాలు ధరించారని భక్తుల నమ్మకం. ఇక తిరుమల శ్రీవారు స్నానం చేసిన నామాల కాలువ దగ్గర ఉన్న ఓ రైతు పొలంలో పురాతన విగ్రహం బయటపడటంతో.. టీటీడీ అధికారులు దీనిపై ఆరా తీస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చిస్తున్నారు.
తిరుపతిలో అద్భుతం
శ్రీవారు స్నానం చేసిన నామాల కాలువ దగ్గర ఉన్న ఓ రైతు పొలంలో బయటపడ్డ పురాతన విగ్రహం
విగ్రహంపై స్పష్టంగా కనబడుతున్న స్వామివారి పాదాలు
పద్మావతి అమ్మవారిని కళ్యాణమాడి మార్గమధ్యలో రామచంద్రాపురం మండలం నడవలూరు నెన్నూరు పంచాయతీల మధ్య ఉన్న ఈ కాలువ దగ్గర శ్రీవారు… pic.twitter.com/uzHnkCW362
— BIG TV Breaking News (@bigtvtelugu) February 2, 2025