స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై గత కొన్ని రోజులుగా తీవ్ర గంధర గోలం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే.. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
ఫిబ్రవరి 15లోపే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. గ్రామ నాయకులు, కార్యకర్తలు అలర్ట్‌గా ఉండాలని సూచనలు చేశారు. నిన్న ఖమ్మం జిల్లాలో పర్యటించిన సందర్భంగా కీలక ప్రకటన చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అయితే..స్థానిక సంస్థల ఎన్నికలపై సరైన తేదీ మాత్రం చెప్పలేదు. అంటే.. ఫిబ్రవరిలో 15 లోపే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే దానిపై క్లారిటీ రాలేదు.