పశ్చిమ గోదావరి తణుకు రూరల్ ఎస్ఐ AGS మూర్తి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి తణుకు రూరల్ ఎస్ఐ AGS మూర్తి ఆత్మహత్యకు ముందు మిత్రుడితో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో వైరల్ గా మారింది. తనని అనవసరంగా కొన్ని విషయాల్లో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన చెందిన ఎస్ఐ మూర్తి.. ఆత్మహత్య చేసుకున్నట్లు ఇందులో మాట్లాడారు.
తనని రేంజ్ కి రిపోర్టు చేయమనడంతో తీవ్ర మనస్థాపానికి గురైన పశ్చిమ గోదావరి తణుకు రూరల్ ఎస్ఐ AGS మూర్తి.. ఇక తనకు బతకడం ఇష్టం లేదని చెప్పాడు. ఫ్యామిలీతో సంతోషంగా ఉంటాను అనుకున్న.. తనతో పని చేసిన సిబ్బంది మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు పశ్చిమ గోదావరి తణుకు రూరల్ ఎస్ఐ AGS మూర్తి.
రేంజికి రిపోర్టు చేస్తే కృష్ణా జిల్లాకి పంపిస్తారని, అక్కడికి వెళ్లడం ఇష్టం లేదని బాధ పడ్డాడు ఎస్ఐ మూర్తి. తన తర్వాత భార్య బిడ్డలకు న్యాయం జరగాలని కోరాడు పశ్చిమ గోదావరి తణుకు రూరల్ ఎస్ఐ AGS మూర్తి. ఇక దీనికి సంబంధించిన ఫోన్ కాల్ ఆడియో వైరల్ గా మారింది.