ఏపీలో మళ్లీ రౌడీ రాజకీయాలు వెలుగుచూస్తున్నాయి. గతంలో జరిగిన దాడులు ఇప్పుడు రిపీట్ అవుతున్నట్లు సమాచారం.తాజాగా మహిళా కార్పొరేటర్లపై తిరుపతి జనసేన ఎమ్మెల్యే కొడుకు దాడికి ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు మధన్ రౌడీయిజం చేస్తున్నట్లు స్థానికంగా టాక్ వినిపిస్తోంది.తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక ముంగిట.. చిత్తూరు భాస్కర్ హోటల్‌లో ఉన్న వైయస్‌ఆర్‌సీపీ మహిళా కార్పొరేటర్ల పై ఆరణి మధన్ దాడికి ప్రయత్నించినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే మహిళా కార్పొరేటర్లను కాపాడేందుకు వెళ్లిన తిరుపతి వైయస్‌ఆర్‌సీపీ ఇంచార్జి భూమన అభినయ్ రెడ్డిపై కూటమి నేతలు దాడికి యత్నించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
మహిళా కార్పొరేటర్ల పై దాడికి ప్రయత్నించిన తిరుపతి జనసేన ఎమ్మెల్యే కొడుకు
తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు మధన్ రౌడీయిజం
డిప్యూటీ మేయర్ ఎన్నిక ముంగిట.. చిత్తూరు భాస్కర్ హోటల్‌లో ఉన్న వైయస్‌ఆర్‌సీపీ మహిళా కార్పొరేటర్ల పై దాడికి ప్రయత్నించిన ఆరణి మధన్… pic.twitter.com/jXz0wSi9jU
— Telugu Scribe (@TeluguScribe) February 3, 2025