రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న బీజేపీ పార్టీలకు కల్వకుర్తి నియోజక వర్గంలో ఎవరూ ఊహించని విధంగా బిగ్ షాక్ తగిలింది. ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీలోని కేడర్ అధికార పార్టీలోకి వెళ్తుంది. కానీ, కల్వకుర్తిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీకి చెందిన కార్యకర్తలు సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఆమన్‌గల్ మున్సిపల్ పరిధిలోని చంద్రాయన్ పల్లి, చిన్న తండా,పెద్ద తండా, శ్రీరామ్ నగర్ తండా గ్రామాల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరిగాయి. ఇందులో సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున గులాబీ జెండాను కప్పుకున్నారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు
కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్‌గల్ మున్సిపల్ పరిధిలోని చంద్రాయన్ పల్లి, చిన్న తండా,పెద్ద తండా, శ్రీరామ్ నగర్ తండా గ్రామాల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుండి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన… pic.twitter.com/LEoOgNC9zi
— Telugu Scribe (@TeluguScribe) February 3, 2025