తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్నీ వందే భారత్ రైళ్లు : కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

-

తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్నీ వందే భారత్ రైళ్లు నడుపుతాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగలేదని వివరించారు. కాజీపేట రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తున్నామని.. కొన్ని పనులకు అనుమతులు రావాల్సి ఉన్నందున ఆలస్యం అవుతోందన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. “ఇటీవల స్విట్జర్లాండ్ వెల్లి అక్కడి రైల్వే ట్రాక్ లను పరిశీలించాం. రైల్వే ట్రాక్ ల నిర్వహణలో స్విట్జర్లాండ్ వ్యవస్థను పాటిస్తున్నాం. 

వందే భారత్ రైళ్లలో స్లీపింగ్ సీట్ల పై ట్రయల్ జరుగుతోంది. ముఖ్యమైన స్టేషన్ల పరిధిలో రక్షణ వ్యవస్థ కవచ్ ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ 1,326 కిలోమీటర్ల మేరకు ప్రస్తుతం కవచ్ టెక్నాలజీ ఉంది. మరో 1,206 కిలోమీటర్ల మేరకు ఈ టెక్నాలజీ ఏర్పాటు చేస్తున్నాం. 2026లోపు దేశమంతా కవచ్ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొస్తాం. సికింద్రాబాద్ లో కవచ్ సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేస్తాం. తెలంగాణ నుంచి ప్రస్తుతం ఐదు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. రాష్ట్రంలోని అన్నీ రైల్వే లైన్ల విద్యుదీకరణ పనులు పూర్తి అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news