తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఒక్క రోజు మాత్రమే… తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగే ఛాన్స్ ఉంది.
ఈ సందర్భంగా బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అమలుపై చర్చ జరుగనుంది. ఈ తరుణంలోనే.. ఇవాళ అసెంబ్లీకి కేసీఆర్ వస్తారా ? లేదా ? అనే చర్చ జరుగుతోంది. ఇక అటు మంత్రుల పై తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రెస్ మీట్ రద్దు చేసుకున్నాట తెలంగాణ రాష్ట్ర మంత్రులు. తాజాగా బీసీ కులగణన రిపోర్టును విడుదల చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే… బీసీ కులగణన రిపోర్టును కేబినెట్ సమావేశం లో పెట్టకుండా మీడియాకు విడుదల చేయడంపై రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం అందుతోంది.