ఏపీ రైతులకు శుభవార్త… అన్నదాత సుఖీభవపై బిగ్ అప్డేట్ వచ్చింది. నేడు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సమావేశం జరుగనుంది. రైతులకు రుణాలు, బ్యాంకర్ల పాత్రపై చర్చ జరుగనుంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు ప్రభుత్వ కసరత్తు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే… నేడు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశం అనంతరం… తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
కాగా… ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. 3 వారాలకు పైగా సమావేశాలు నిర్వహించే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 6న ఏపీ కేబినెట్ సమావేశం ఉంటుంది. అసెంబ్లీ పని దినాలు, బడ్జెట్ తేదీలు ఖరారు చేయనున్న కేబినెట్.. ఈ మేరకు ఈ నెల 6న భేటీ కానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.