రాష్ట్రంలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు సీరియస్ అయ్యింది.గురుకులాల్లో విద్యార్థులు తరచూ తీవ్ర అస్వస్థతకు గురవ్వడంపై ఆగ్రహించిన న్యాయస్థానం ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలని రేవంత్ సర్కార్‌ను కోరింది.
ఎనిమిది వారాలు అవుతున్నా అధికారులు నివేదిక ఇవ్వకపోవడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. తాజాగా మరోసారి పదిరోజుల్లో రిపోర్ట్ సమర్పించాలని ఆదేశింది. ఈసారి ప్రభుత్వం తరపున నివేదిక సమర్పించకపోతే కోర్టు ఆదేశాల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలిసింది. కాగా, హైకోర్టు ఆదేశాలపై రేవంత్ సర్కార్ ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.