మీరు ఇంకెప్పుడు ప్రిపేర్ అయ్యి వస్తారు? : మంత్రి శ్రీధర్ బాబుపై హరీశ్ రావు ఫైర్

-

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి.నేడు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ కేబినెట్ భేటీ నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తితో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.అసెంబ్లీ వెంటనే వాయిదా వేయడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.

తాజాగా మాజీమంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు. కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతున్నదని, సబ్జెక్ట్, నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు కోరడం హాస్యాస్పదమని విమర్శించారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు, నేడు పాలక పక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు.ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు? అంటూ కాంగ్రెస్ పార్టీని ట్యాగ్ చేస్తూ మాజీ మంత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Latest news