ఇవాళ సాయంత్రం 6.30 తర్వాత ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఢిల్లీ ఎన్నికల తరుణంలో ఆరు గంటలకే ప్రధాన పార్టీల ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. గాంధీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని తూర్పు ఆజాద్ నగర్ పోలింగ్ బూత్‌లోని MCD ప్రతిభా విద్యాలయంలో మాక్ పోలింగ్ జరుగుతోంది.
ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ తరుణంలోనే ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ నెల 8న ఓట్లలెక్కింపు, ఫలితాలు ఉండనున్నాయి. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ నేతల మధ్య పోటాపోటీ ఉంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసు యంత్రాంగం పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం 6.30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఉండనున్నాయి.