హైదరాబాద్ మహానగరంలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. హైదరాబాద్ చర్లపల్లి లో భారీ అగ్ని ప్రమాదం జరగడంతో దాదాపు 16 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. నిన్న అర్ధరాత్రి చర్లపల్లి లో ఉన్న సర్వోదయ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా కెమికల్ డ్రమ్ములు పేలిపోయాయి. ఈ సంఘటన… జరగగానే అక్కడ ఉన్న స్థానికులు అందరూ ఉలిక్కిపడ్డారు.
అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు కార్మికులు ఎవరూ లేకపోవడంతో… ప్రాణం నష్టం తప్పింది. కానీ ఈ అగ్ని ప్రమాదంలో 16 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. పక్కనే ఉన్న మహాలక్ష్మి ప్లాస్టిక్ అలాగే హరిత ఎంటర్ప్రైజెస్, హైటెక్ ఇండస్ట్రీస్ కు కూడా మంటలు వ్యాపించాయి. అయితే ఈ మంటలను అదుపు చేసేందుకు రంగంలోకి ఫైర్ సిబ్బంది దిగి… ఆస్తి నష్టం మరింత జరగకుండా చూసింది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చర్లపల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.16 కోట్ల ఆస్తి నష్టం
సర్వోదయ ఫ్యాక్టరీలో పేలిన కెమికల్ డ్రమ్ములు
పక్కనే ఉన్న మహాలక్ష్మి ప్లాస్టిక్స్, హరిత ఎంటర్ ప్రైజెస్, హైటెక్ ఇండస్ట్రీస్ కు వ్యాపించిన మంటలు
మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది pic.twitter.com/aiiplwa1Rd
— BIG TV Breaking News (@bigtvtelugu) February 5, 2025