వెండి ఆభరణాలు కొనడానికి ఏ రోజు మంచిది? ఈరోజుల్లో కొంటే మంచి ఫలితం ఉంటుంది..!

-

చాలా శాతం మంది ఏవైనా కొత్త వస్తువులను కొనుగోలు చేసే ముందు మంచి రోజులను చూసుకుంటారు. ముఖ్యంగా బంగారం, వెండి వంటివి కొనుగోలు చేయాలంటే కొన్ని ప్రత్యేక రోజులను ఎంపిక చేసుకుని కొనుక్కుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం వెండిని కొనడానికి కొన్ని ఉత్తమమైన రోజులు కూడా ఉన్నాయి. అటువంటి అనుకూలమైన రోజులలో కొనడం వలన ఎంతో మంచి కలుగుతుంది అని మరియు శ్రేయస్సు, సంతోషం వంటివి పెరుగుతాయని అందరూ నమ్ముతారు. అందుకే మంచి రోజులను మాత్రమే ఎంపిక చేసుకుంటారు.

పైగా వెండి ఆభరణాలను ధరించడం వలన కూడా ఆరోగ్యంతో పాటు సంతోషం కూడా పెరుగుతుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజులలో వెండిని కొనుగోలు చేయడం వలన శ్రేయస్సు మరింత పెరుగుతుంది అని నిపుణులు చెబుతున్నారు. గురువారం వెండిని కొనడం వలన ఎంతో మంచి జరుగుతుంది. ముఖ్యంగా వెండిని కొనుగోలు చేయడానికి గురువారం ఒక పవిత్రమైన రోజు అనే చెప్పవచ్చు. బృహస్పతి సంపదకు సంబంధించిన గ్రహంగా ప్రసిద్ధి చెందాడు. అందువలన గురువారం వెండిని కొనుగోలు చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. అంతేకాకుండా పుష్యమి నక్షత్రం రోజున వెండిని కొనుగోలు చేయడం వలన సంపదను మరింత పెంచుకోవచ్చు.

ఆర్థికంగా ఎదుగుదల ఉండాలి అంటే పుష్యమి నక్షత్రం నాడు వెండిని కొనుగోలు చేయడం మేలు. చాలా శాతం మంది అక్షయ తృతీయ నాడు కేవలం బంగారం మాత్రమే కొనుగోలు చేస్తారు. అయితే ఈ రోజున వెండిని కూడా కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే అక్షయ తృతీయ రోజున ఎలాంటి పెట్టుబడి పెట్టిన అది మరింత సంపదను తీసుకొస్తుందని హిందువులు నమ్ముతారు. అయితే వెండిని కొనుగోలు చేసే సమయంలో ఉత్తరం లేక తూర్పు దిశలో ఉన్న దుకాణం నుండి కొనుగోలు చేయడం వలన అక్కడ ఉండే సానుకూల శక్తి మీ శ్రేయస్సును మరింత పెంచుతుంది అని వాస్తు శాస్త్రం చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news