ఢిల్లీలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

-

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫిబ్రవరి 5 బుధవారం రోజున సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ముగిసే సమయానికి క్యూ లో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసేందుకు అనుమతించారు. సాయంత్రం ఐదు గంటల వరకు 58% పోలింగ్ నమోదయినట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. దీంతో మొత్తం పోలింగ్ 65% చేరే అవకాశం కనిపిస్తోంది.

సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి. మొత్తం 70 స్థానాల్లో 699 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఢిల్లీలో మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. భారత ఎన్నికల సంఘం 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికలలో బిజెపి 68 స్థానాలలో పోటీ చెయ్యగా.. ఆ పార్టీ మిత్రపక్షాలు జెడియు, లోక్ జనశక్తి రామ్ విలాస్ పాసవాన్ పార్టీ ఒక్కో స్థానంలో పోటీ చేశాయి.

ఇక ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలలో {70} పోటీ చేశాయి. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 8న జరగనుంది. ఈ ఎన్నికలలో విజయం సాధించి హైట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటుంది ఆప్.

Read more RELATED
Recommended to you

Latest news