ఇవాళ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య మొదటి వన్డే మ్యాచ్

-

నేటి నుంచి ఇంగ్లాండ్‌ వర్సెస్‌ టీమిండియా మధ్య వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా జట్టు ఇంగ్లాండ్‌తో తలపడనుంది. గురువారం నాగ్‌పూర్‌లోని VCA స్టేడియంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌ జరుగనుంది. దీంతో చాలా మంది సీనియర్‌ భారత స్టార్లు వన్డే క్రికెట్ ఫార్మాట్‌లోకి తిరిగి రానున్నారు. ఇటీవలి కాలంలో ఫామ్‌లో లేని రోహిత్, విరాట్ కోహ్లీల బ్యాటింగ్ ప్రదర్శనపైనే అందరి దృష్టి ఉంటుంది. ఇక ఈ మ్యాచ్‌ ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. స్టార్‌ స్పోర్ట్‌, హాట్‌ స్టార్‌ లో మ్యాచ్‌ తిలకించవచ్చును.

India vs England, 1st ODI

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(w), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(c), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్

ప్రాబబుల్ ఎలెవన్: రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్ (విసి), విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ / రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్

Read more RELATED
Recommended to you

Latest news