నేడు కాంగ్రెస్ శాసనసభాపక్షం భేటీ కానుంది.. కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ ఉంటుంది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన, ఎస్సీ వర్గీకరణపై ప్రధానంగా చర్చ ఉండనుంది. ఈ భేటీలో రాష్ట్ర ఇంచార్జీ దీపాదాస్ మున్షీ పాల్గొననున్నారు. ఇక అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి పయనం కానున్నాడు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/congress-2.jpg)
ఢిల్లీ నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి పిలుపు వచ్చింది. దీంతో.. ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళతారు. సాయంత్రం పూట ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ నుంచి రేవంత్ కు అత్యవసర పిలుపుపై రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే… సీఎం మార్పుపై చర్చించేందుకు అని కొందరు, ఇటీవల పార్టీలో జరుగుతోన్న పరిణామాలపై చర్చించేందుకు అని గాంధీ భవన్ లో ప్రచారం జరుగుతోంది. ఇక ఎమ్మెల్యేల రహస్య సమావేశంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి పయనం కానున్నాడని అంటున్నారు.