జగన్ ఇంటి వద్ద అగ్ని ప్రమాదంపై టీడీపీ పార్టీ స్పందించింది. “సిట్ పడింది.. తగలబడింది”… జగన్ ఇంటి వద్ద అగ్ని ప్రమాదంపై అంటూ టీడీపీ సంచలన ట్వీట్ చేసింది. ఉదయం లిక్కర్ స్కాంలో సిట్ పడింది.. రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడిందంటూ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేసింది టీడీపీ. దీంతో… జగన్ ఇంటి వద్ద అగ్ని ప్రమాదంపై టీడీపీ పార్టీ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
కాగా, తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటి బయట రోడ్డు పక్కన ఉన్న గార్డెన్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ తాగి పడేయడంతో మంటలు అంటుకున్నట్లు సమాచారం అందుతోంది. గడ్డి బాగా ఎండిపోయి ఉండడంతో నిప్పు అంటుకుని ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అయితే… సెక్యూరిటీ సిబ్బంది, ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇక తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద జరిగిన అగ్ని ప్రమాదం వీడియో వైరల్ గా మారింది.
సిట్టు పడింది – తగలబడింది..
ఉదయం లిక్కర్ స్కాంలో సిట్ పడింది. రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడింది.
* ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటి ?
* సిట్ తన ఇంటి దాకా వస్తుందని, ముందే లిక్కర్ స్కాంకి సంబంధించి తాను రాసుకున్న లెక్కలు, డాక్యుమెంట్లు తగల బెట్టారా ?
* నిన్న… pic.twitter.com/4C0vGqqFDu— Telugu Desam Party (@JaiTDP) February 6, 2025