మావటిపై దాడి చేసిన ఏనుగు అతన్ని చంపేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కేరళలో నిన్న రాత్రి మావటి కుంజుమన్(50) తన బృందంతో కలిసి ప్రదర్శన ఇచ్చారు. ఈ సమయంలో అదుపు తప్పిన ఏనుగు ఒక్కసారిగా జనాలపై దాడి చేసింది. దానిని నియంత్రించేందుకు కుంజుమన్ ప్రయత్నించగా, అతడిపై ఏనుగు దాడికి దిగడంతో చనిపోయాడు.
అయితే, ఏనుగు ఎందుకు అలా ప్రవర్తించిందో ఒక్కసారిగా ఎవరికీ అర్థం కాలేదు. ఏనుగు దాడి చేసే సమయంలో చుట్టుపక్కల జనాలు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఏనుగుపై కూర్చున్న వారిని సైతం కింద పడేయాలని చూడగా, వారు బలంగా పట్టుకుని కూర్చుకున్నారు. దీంతో మావటిని ఏనుగు కిందపడేసి తన దంతాలతో కుమ్మేసి రెండే కాళ్ల మధ్యలో పెట్టుకుని తొక్కి చంపేసింది. ఈ విజువల్స్ చూసేందుకు సైతం చాలా భయంకరంగా ఉన్నాయి.
మావటిపై దాడి చేసి చంపిన ఏనుగు…
ఓ ఏనుగు తనను పెంచిన మావటి ప్రాణాలనే బలితీసుకుంది. కేరళలో నిన్న రాత్రి మావటి కుంజుమన్(50) తన బృందంతో కలిసి ప్రదర్శన ఇచ్చారు. ఈ సమయంలో ఏనుగు జనాలపై దాడి చేసింది. దానిని నియంత్రించేందుకు కుంజుమన్ ప్రయత్నించగా, అతడిపై ఏనుగు దాడికి దిగడంతో చనిపోయాడు. pic.twitter.com/xiAJCr4o1W
— ChotaNews App (@ChotaNewsApp) February 7, 2025