పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడుతున్నవారు ఇద్దరూ దొందు దొందే అని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి అన్నారు. ప్రభుత్వం కి ధైర్యం ఉంటె రాజీనామా చేసి పోటికి వెళ్ళాలి. ఫిరాయింపుల ఎమ్మెల్యే లతో రాజీనామా చేసి తిరిగి పోటి చెయ్యాలి. పార్టీ మారినప్పుడు రాజీనామా చేస్తేనే వారు మొగోళ్ళు లేదంటే ఆడంగులే. రాజీనామా చేసినవారు పోటీ చేస్తే నే వారు నిజమైన లీడర్లు. పార్టీ మార్పిడిలు తప్పుడు నిర్ణయం. నలభై శాతం మించి రుణమాఫి జరగలేదు. పక్కింటి కుటుంబ సమస్యలని నోటికి వచ్చే విధంగా మాట్లాడే మంత్రులు ఉన్నారు అని ఆయన అన్నారు.
అలాగే కాంగ్రెస్ చేసింది కులగణన కాదు.. రాజకీయ గణన మాత్రమే. కేసీఆర్, రేవంత్ రెడ్డి ల మైండ్ సెట్ ఒకటే. ప్రభుత్వం ని కూలగొట్టే అవసరం ఏముంది. ప్రభుత్వం కూలగొట్టే ఓపిక మాకు లేదు. అవిశ్వాసం అనేది ఒక ఎమ్మెల్యే మాట..అది పార్టీ నిర్ణయం కాదు. ప్రజల అసంతృప్తి ని మేము ఎండగడుతాం అని కామారెడ్డి ఎమ్మెల్యే అన్నారు.