ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ ప్రజలు చీపురుతో ఊడ్చేశారు..ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుందని అన్నారు బండి సంజయ్. ఢిల్లీ ప్రజలు ప్రజాస్వామ్య పాలన కోరుకున్నారన్నారు. ఢిల్లీలో బీజేపీ జెండా ఎగురుతుందని ముందు నుంచి ఊహించిందే.. తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని వెల్లడించారు కేంద్ర మంత్రి బండి సంజయ్.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/01/Bandi-Sanjay-7.jpg)
తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధిస్తామని ప్రకటన చేశారు బండి సంజయ్. డిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందు నుంచి ఊహించిందేనని… డిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని చీపురుతో ఊడ్చేశారన్నారు. ప్రజలు అవినీతి, కుంభ కోణాలు, జైలు పార్టీలు మాకు వద్దు అనుకున్నారని… మేధావి వర్గం అంతా బీజేపీకి ఓటు వేశారని వివరిం చారు కేంద్ర మంత్రి బండి సంజయ్.