సీఎం రేవంత్ రెడ్డి కి మాజీ మంత్రి హరీష్ రావు సంచలన లేఖ..!

-

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. లేఖలో వివరాలు.. ఆ నాడు మీరు నిరహారదీక్ష చేపట్టిన సమయంలో మా ప్రభుత్వం పై దుమ్మెత్తి పోసి నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్కువ పరిహారం ఇచ్చామని మీరు ఆరోపణలు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఎక్కువ పరిహారం ఇచ్చి నిర్వాసితుల దగ్గర మీ మాట నిలబెట్టుకోవాలి. నిరహారదీక్ష పేరిట ఆనాడు మీరు చేసింది రాజకీయమా.. న్యాయపోరాటమా అనేది మీ నిర్ణయాన్ని బట్టి తేలిపోతుందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని.. కాళేశ్వరంతో ప్రయోజనం లేదని విమర్శలు చేసి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీలు హైదరాబాద్ తరలించేందుకు టెండర్ల ప్రక్రియ చేపడుతున్నట్టు తెలిసింది. దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా మాజీ సీఎం కేసీఆర్ సారధ్యంలోని ప్రభుత్వంలో భూనిర్వాసితులకు మెరుగైన ఫ్యాకేజీ అందించినట్టు గుర్తు చేశారు. 90 శాతం పనులు పూర్తి అయ్యాయని మిగిలిన 10 పనులను పూర్తి చేయాలన్నారు. కోర్టు కేసుల్లో తీర్పు వచ్చిన వారికి ఫ్యాకేజీ మిస్ అయిన వారికి వితంతువులను కూడా కుటుంబంగా పరిగణించి పరిహారం అందించాలని లేఖలో కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news