నాలుగు దశాబ్దాల తర్వాత నేడు కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామికి మహాకుంభాభిషేకం జరగనుంది. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.మూడు రోజుల పాటు ఈ క్రతువు జరగనుందని పేర్కొన్నారు. ఇప్పటికే శుక్రవారం ఉదయం ఈ క్రతువు మొదలైందని, సద్గురు సచ్చిదానంద సరస్వతి పర్యవేక్షణలో ఉ.10:42 సుముహూర్తంలో కుంభాభిషేక మహోత్సవం ప్రారంభం కానుందని తెలిపారు.
ఈ మహాఘట్టం కోసం దేవాదాయ, ఇతర శాఖల అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.ఈ మహకుంభాభిషేక మహోత్సవంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నారు. ఎమ్మెల్సీ కోడ్ కారణంగా ఈసీ ప్రత్యేక అనుమతితో ఈ ముగ్గురు మంత్రులు పూజా కార్యక్రమానికి హాజరువుతారని తెలుస్తోంది.